చలిమిడి

 

 

కావలసినవి:

బియ్యం - 300 గ్రాములు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, ఆరాక, పిండి చేయాలి)

నెయ్యి - ఒక కప్పు

ఇలాచి పొడి - అర టీ స్పూ 

జీడిపప్పు - 20 

ఎండుకొబ్బరి తురుము - అర కప్పు

బెల్లం తురుము - 150 గ్రాములు

గసగసాలు - రెండు స్పూన్లు

 


తయారీ :-  

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి గసగసాలు వేసి వేయించి తీసి  దానిలోనే  నెయ్యి వేసి, వేడయ్యాక కొబ్బరి తరుగు, కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. తరువాత మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. అందులో బెల్లం వేసి, లేత పాకం పట్టాలి.ఇప్పుడు  స్టవ్ సిమ్‌లో పెట్టి, బెల్లం పాకంలో బియ్యం పిండి, జీడిపప్పు, కొబ్బరి, ఇలాచి పొడి, గసగసాలు వేసి ముద్దలు లేకుండా బాగా కలిపి చివరిలో నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి  వేడి తగ్గాక, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.