హల్వా రెసిపి

 

 

కావలసిన పదార్థాలు :

తాటిబెల్లం: 400 గ్రాములు .

బియ్యం: పావు కేజీ

జీడిపప్పు : 50 గ్రాములు.

నెయ్యి:150 గ్రాములు.

కొబ్బరిపాలు: 1 గ్లాసు

 

తయారీ విధానం :

బియ్యం 4 గంటలు నానబెట్టి,బాగా పలుచగా, మెత్తగా రుబ్బాలి.

ఈ పిండిని తెల్లటి వస్త్రం లో వడగట్టాకా నీళ్లు పోయి చిక్కటి పేస్ట్‌ మిగులుతుంది.

తర్వాత బెల్లం తురుమును గిన్నెలో వేసి గ్లాసు నీళ్లు పోసి పాకం పట్టి కొంచం చల్లారక ఒకసారి వడగట్టాలి .

మళ్ళీ పాకాన్ని బాణలిలో పోసి ముదురుపాకం వచ్చేవరకూ కలుపుతూ ఉండాలి.

ఇప్పుడు బియ్యం పేస్ట్‌ను అందులో వేసిఉండలు లేకుండా కలపాలి.

కొంచం చిక్కబడ్డాక కొబ్బరిపాలు, నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుతూ ఉండాలి.

బాగా చిక్కబడినా తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి .

ఫ్రై చేసిన జీడిపప్పు చల్లాలి. ప్లేట్ కు నెయ్యి రాసిన హల్వ వేసి ముక్కలుగా కట్ చెయ్యాలి ..