గుమ్మడికాయ హల్వా !

 

 

కావలసిన పదార్థాలు:-

తీపి గుమ్మడికాయ -1 (మీడియం సైజు) 
చెక్కర - అరకేజీ 
కోవా  - 1 కప్పు 
జీరపప్పు - 1/2 కప్పు 
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి  - 1 స్పూను 
పాలు - 2 కప్పులు 

 

తయారుచేసేవిధానం:-

తీపి గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లెకుండా సన్నగా తురుముకోవాలి. బాణలిలో గనీ, దళసరి గిన్నెలో గానీ నెయ్యి వేసి జీర పప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి. అందులోనే తురుము,పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత ( చిక్క బడ్డాక ) చెక్కర, కోవా, యాలకుల పొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు వేయించిన జీరప్పప్పులు కూడా వేసి దింపాలి. అంతే రుచ్చికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ..

-Parveen