గోధుమ ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు:-
గోధుమపిండి - అరకప్పు
ఉప్పు - చాలా కొద్దిగా
బెల్లం - 1 కప్పు
ఇలాచీపొడి - 1/2 స్పూన్
నెయ్యి - 4 స్పూన్స్
కొబ్బరి కోరు - 2 స్పూన్స్
డ్రై ఫ్రుట్స్
తయారు చేయు విధానం:-
* చవితి ముందు రోజే శుచిగా ఉండే వస్త్రాలతో గోధుమపిండిలో కొద్దిగా ఉప్పుకలిపి.. ఆ గట్టి చపాతి పిండిని చిన్నచిన్న ఉండలుగా కొన్ని గుండ్రంగా కొన్ని కోలగా పొడవుగా జంతికలమాదిరి సన్నగా చేసుకొని.... ఒక చేటలో లేదా పళ్ళెంలో... కొద్ది పొడిపిండి జల్లి గాలికి నీడలో ఉంచాలి.
* చవితి రోజు ఉదయం మూకుడులో నేతిని 2 చెంచాలు వేసి ముందుగా డ్రై ఫ్రుట్స్ తరువాత కొబ్బరి వేయించాలి.
* అవి వేగాక బెల్లం నీళ్ళలో నానబెట్టి ఆ రసాన్ని పూర్తిగావడకడుతూ మూకుడులో పోసి ఈ ఆరిన గోధుమ ఉండ్రాళ్ళను ఆబెల్లం నీళ్ళలోవేసి ఇలాచీపొడి జల్లి కలుపుతూ చిన్న మంటపై కొద్దిసేపు లోపల వరకు ఉడికేలా చూసుకుని కొద్దిగా గోధుమపిండి నీళ్ళలో కలిపి ఇందులో వేసి చిక్కబడినాక పొయ్యిమీద నుండి దించి మిగిలిన నెయ్యి వేసి కలిపి నైవేద్యంగా సమర్పించాలి.
* ఈ డ్రై ఫ్రుట్స్ కొబ్బరితో కలిపి ఉడికించకపోతే వాటిని విడిగా తీసి ఉంచుకుని పైన అలంకరించు కోవాలి. చాలా రుచిగా ఉండే ఈ ప్రసాదం ఫ్రీజ్ లో పెట్టుకుని చల్లగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది.
-