గ్లూకో పుడ్డింగ్

 

 

 

ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యే లోపు 4, 5 స్పూన్ ల కస్టర్డ్ పౌడర్ లో చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తరవాత కాస్త నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మరిగిన పాలలో కలిపి అది చిక్కబడేవరకు కలుపుతూ మరగనివ్వాలి. ఆ తరవాత దానిని దించి పక్కన పెట్టేయాలి.

వీడియోలో చూపిన విధంగా ఒక గిన్నెలో బిస్కెట్ లను పేర్చి , దాని పై కొన్ని డ్రై ఫ్రూట్ వేసి ఆ పై కస్టర్డ్ మిశ్రమాన్ని వేయాలి. దాని పై మళ్ళీ బిస్కెట్ లను పేర్చి, డ్రై ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ వేయాలి, ఇలా వీలైనన్ని లేయర్ లు పేర్చుకోవాలి. ఆ తరవాత కోకో పౌడర్ తీసుకుని అందులో కాస్త నీటిని పోసి మరగనివ్వాలి. అది ఉడికి చిక్కబడ్డాక లేయర్ లు గా పేర్చుకున్న కస్టర్డ్, బిస్కెట్, డ్రై ఫ్రూట్ మిశ్రమం పై వేయాలి. ఆ తరవాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ని దాని పై వేసి ఫ్రిజ్ లో ఒక గంట సేపు పెట్టి తీసేస్తే సరి.

గ్లుకో పుడ్డింగ్ రెడీ.

 

 

స్వీట్ హాట్ జొన్న

 

 

 

స్టవ్ పై గిన్నె పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోయాలి, నూనె కాగే లోపు ఒక గిన్నె తీసుకుని గరిటె తో మూడు గరిటెలు జొన్న పిండి, 11/2 గరిటెలు బియ్యపు పిండి, 2 గరిటెలు మైదా పిండి, 2 స్పాన్ ల పంచదార జిలకర, ఉల్లిపాయ ముక్కలు, గ్రిండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరవాత సోడా వేసి నీళ్లు వేసి బాగా కలపాలి. ఆ తరవాత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి, కాగిన నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు బజ్జీల్లా ఫ్రై చేసుకోవాలి.