ఫ్రూట్ కాక్ టైల్ ఐస్ క్రీం
కావలసిన పదార్ధాలు..
వెనిల్లా ఐస్ క్రీం - 1/2 కప్పు
స్ట్రాబెర్రీ ఐస్ క్రీం - 1/2 కప్పు
పిస్తా ఐస్ క్రీం - 1/2 కప్పు
క్రీం - 1/2 కప్పు
స్ట్రాబెర్రీ జెల్లీ - 1/2 ప్యాకెట్
మిక్స్ డ్ ఫ్రూట్స్ - 1/2 టిన్ను (లేదా సీజనులో వచ్చే ఫ్రూట్స్ ని వాడవచ్చు )
జీడిపప్పు - 2 చెంచాలు
పిస్తాపప్పు - 2 చెంచాలు
బాదంపప్పు - 2 చెంచాల
తయారుచేసే విధానం :
* ముందుగా గ్లాస్ బౌల్ తీసుకొని మిక్స్ డ్ ఫ్రూట్ ని అడుగు వైపున అంతా పరచి ప్రీజ్ లో పెట్టి బాగా చల్లబరచాలి.
* తరువాత స్ట్రాబెర్రీ జెల్లీని, మిక్స్ డ్ ఫ్రూట్స్ మీద స్ప్రెడ్ చెయ్యాలి.
* ఈ జెల్లీమీద వెనిల్లా ఐస్ క్రీం ని స్ప్రెడ్ చెయ్యాలి.
* తరువాత స్టాబెర్రీ ఐస్ క్రీం స్ప్రెడ్ చెయ్యాలి.
* చివరగా పైన పిస్తా ఐస్ క్రీం ను కూడా స్ప్రెడ్ చెయ్యాలి.
* క్రీం ని బాగా షేక్ చేసి ఐస్ క్రీంను కూడా స్ప్రెడ్ చెయ్యాలి.
* క్రీం ని బాగా షేక్ చేసి ఐస్ క్రీం పైన డెకరేట్ చేసి పైన బాదంపిస్తా పప్పులను చల్లి వెంటనే సర్వ్ చెయ్యాలి.