డ్రై ఫ్రూట్ బాల్స్

 

 

కావలసిన పదార్థాలు:

ఖర్జూరం                                                - రెండు కప్పులు
బాదంపప్పు                                          - పావు కప్పు
జీడిపప్పు                                             - అరకప్పు
పిస్తా                                                     - పావుకప్పు
వేరుశనగలు                                         - వంద గ్రాములు
నెయ్యి                                                  - రెండు చెంచాలు

 

తయారీ విధానం:

ఖర్జూరాన్ని గింజలు తీసేసి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. బాదంపప్పుని నానబెట్టి, తొక్క ఒలిచేయాలి. తరువాత వీటిని సన్నగా తురుముకోవాలి. పిస్తాపప్పుని మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోవాలి. జీడిపప్పు, వేరుశనగల్ని వేర్వేరుగా మిక్సీలో వేసి... పౌడర్ లా కాకుండా ముక్కలు ఉండేలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటినీ ఓ బౌల్ లో వేసి, తేనె కూడా వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని... డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూల్లా ఒత్తుకోవాలి. రుచికరమైన ఈ బాల్స్ ఎంతో శక్తిని ఇస్తాయి.

- Sameera