ఖర్జూరం హల్వా
కావలసిన పదార్థాలు:
ఖర్జూరాలు - పావు కిలో
పాలు - అరలీటరు
కార్న్ ఫ్లోర్ - ఐదు చెంచాలు
నెయ్యి - పావు కప్పు
చక్కెర - ఐదారు చెంచాలు
జీడిపప్పులు - పది
కిస్ మిస్ - పది
బాదం పప్పులు - పది
యాలకుల పొడి - ఒక చెంచా
తయారీ విధానం:
ఖర్జూరాలను గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా పాలు పోసి జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి పక్కన పెట్టాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. మరిగాక ఖర్జూరాలను వేయాలి. అవి బాగా ఉడికేవరకూ సన్నని మంట మీద ఉడికించాలి. ఆ తరువాత చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తరువాత కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇది వేసిన తరువాత మిశ్రమం చిక్కబడటం మొదలవుతుంది. అప్పట్నుంచీ కొద్దికొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. హల్వా మొత్తం దగ్గరగా అయిపోయిన తరువాత దించేసుకోవాలి. ఓ ప్లేట్ కి నెయ్యి రాసి అందులో హల్వా వేసి నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
- Sameera