దసరా స్పెషల్

 

 

 

దుర్గాష్టమి స్పెషల్

 

 కదంబం ప్రసాదం

 

 

 కావలసినవి :
కందిపప్పు 1/2 కప్
బియ్యం 1/2 కప్పు
వంకాయ - 1
సొర్రకాయ -1/4
దోసకాయ- 1/4
బీన్స్ తగినన్ని
పోటాటో -1
వేరుశెనక్కాయలు - 50 గ్రాములు
బేబీ కార్న్ -2
క్యారెట్-1/2
టోమాటో -2
తగినంత కరేపాకు
కొత్తిమిర- సరిపడగా
పచ్చి కొబ్బెర 1 కప్పు (తురిమినది)
గ్రీన్ చిల్లిస్- 4
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

 

తయారీ విధానం :
ముందుగా  కాయగురాలన్నీకట్ చేసి కుక్కర్ లో కందిపప్పు ,బియ్యం ,వేరుశెనగ కాయలు , కూరగాయలు వేసిపసుపు , ఉప్పు ,నీళ్ళు  వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి .మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు ,పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గుజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసిబాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్ లో వేసి,కొత్తిమిర,కరేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించాలి. అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండు మిర్చి ,ఇంగువ వేసి తాలింపు పెట్టాలి.చివరిలో కొబ్బరి కలిపి దించాలి.

 

 

 మహిషాసుర మర్ధిని (ప్రసాదం)

 

 బెల్లం అన్నం

 

 

కావలసినవి
బియ్యం -100 గ్రాములు
బెల్లం -150 గ్రాములు
యాలకులు-  5
నెయ్యి -50 గ్రాములు
జీడిపప్పు 10

 

చేసే విధానం
ముందుగా బియ్యం  నాననివ్వండి .తరువాత మెత్తగా ఉడికించాలి .అందులో తరిగిన బెల్లం వేసి
మొత్తం కరిగెంత వరకు ఉడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,
యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

 

 

రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం

 

పరమాన్నం

 

 

 

కావలసినవి

బియ్యం - 1 కప్పు
సగ్గుబియ్యం - 1/2 కప్పు
పాలు - 2 కప్పులు
నీళ్ళు - 1 కప్పు
జీడుపప్పు - కొంచం
బాదాంపప్పు - కొంచం
కిస్మిస్స్ - కొంచం
నెయ్యి - 2 స్పూనులు
పంచదార - 1 1/2 కప్పు

 

తయారీ విధానం -
సగ్గుబియ్యం ,  బియ్యం కడిగి పాలు , నీళ్ళు పోసి ఉడకనివ్వాలి . కొంచం ఉడికిన తరువాత పంచదార వేసి దగరగా  అవనివ్వాలి. వేరొక గిన్నెలో  నెయ్యి వేసి బాదాం, కిస్మిస్స్,జీడిపప్పు వేపి ఉడుకుతున్న పరమాన్నంలో  కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి  .