కార్న్‌ఫ్లోర్ బర్ఫీ
కావలసిన పదార్థాలు:-
కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు
పాలు - పావు లీటర్
నెయ్యి - తగినంత
జీడిపప్పు - 10
పంచదార - ఒకటిన్నర కప్పు
తయారివిధానం:-
ముందుగా ఒక పాత్రలో పంచదార, కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా పాలు పోసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్‌పెట్టి అందులో ఈ మిశ్రమం వేసి సన్నని మంటపై చిక్కబడేదాక గరిటెతో తిప్పుతుండాలి. తర్వాత ప్లేట్‌కి నెయ్యి రాసి సమానంగా పరిచి నేతిలో వేయించిన జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకుని దీనిపై వేసుకుని కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి....