కొబ్బరి పైనాపిల్ హల్వా..
కావలసిన పదార్ధాలు:
కొబ్బరి తురుము - రెండు కప్పులు
పైనాపిల్ ముక్కలు - తగినన్ని
నెయ్యి - 2 స్పూన్లు
పంచదార - కప్పు
యాలకుల పొడి - కొద్దిగా
తయారీవిధానం:
ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి కొబ్బరి తురుము వేయించుకోవాలి. ఆ తరువాత పైనాపిల్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని వేయించుకున్న కొబ్బరి తురుములో కలిపాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని.. అందులో కొద్దిగా నీరు పోసి, పంచదార కూడా వేసి అది కరిగిన తరువాత.. పైన మిశ్రమం వేసి.. యాలకుల పొడి వేసి తడి అంతా ఆవిరైపోయేవరకూ కలుపుతూ ఉడికించాలి. చివరిగా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కోయాలి. అంతే కొబ్బరి పైనాపిల్ హల్యా రెడీ అయినట్టే.