చాకొలెట్ బాదం హల్వా

 

కావలసిన పదార్థాలు:

పాలు - అర లీటరు

కోకో పౌడర్ - అర కప్పు

పంచదార - 250 గ్రాములు

బ్రెడ్ స్లైసులు -2

జీడిపప్పు పొడి - రెండు స్పూన్లు

 కిస్‌మిస్ - కొన్ని

నెయ్యి - రెండు స్పూన్స్

బాదంపప్పు- 50గ్రాములు

తయారీ:

ముందుగా  పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించి పెట్టుకోవాలి. తరువాత  పాలలో బ్రెడ్ స్లైస్ లు , కోకో పౌడర్ , పంచదార, బాదాం నానపెట్టి పొట్టు తీసుకుని  చేసుకున్న పేస్ట్,  కొద్దిగా జీడిపప్పు పొడి వేసి కలిపి ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం గట్టిగా హల్వాలా అయిన తరువాత చివరిలో నెయ్యి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు  ప్లేటకి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకుని హల్వాను ప్లేట్ లో వేసుకుని ముక్కలుగా కట్ చేసి దానిపై కిస్మిస్, జీడిపప్పు,బాదాం పలుకులు వేసి డెకరేట్ చేసుకోవాలి.