క్యారెట్, బాదం బర్ఫీ  ( శివరాత్రి స్పెషల్స్ )

 

 

కావలసిన పదార్థాలు:-
బాదం పప్పు - 1 కప్పు
పంచదార  - 2 కప్పులు 
వెన్న - అర కప్పు
క్యారెట్ - 2 
యాలకుల పొడి - అర టీ స్పూను.


తయరివిధానం:-

ముందుగా బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి తరువాత రోజు పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత  క్యారెట్‌ని కడిగి కట్ చేసి ఉడికించాలి. ఇప్పుడు బాదం, క్యారెట్‌లని కొద్దిగా పాలు కలుపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో  బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.  ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్  బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.