బనానా షీరా

 

 

 

కావలసిన పదార్థాలు..
బొంబాయి రవ్వ           - ఒక కప్పు
నీళ్లు                        - రెండు కప్పులు
అరటిపళ్లు                 - మూడు
చక్కెర                      - అరకప్పు
నెయ్యి                      - మూడు చెంచాలు
జీడిపప్పు                 - పది పలుకులు
కిస్ మిస్                  - పది
పిస్తాపప్పులు            - పది
యాలకుల పొడి         - చిటికెడు

 

తయారీ విధానం

అరటిపండ్లను మెత్తగా చిదిమి పేస్ట్ లా చేసి పక్కన పెట్టాలి. స్టౌ మీద కడాయి పెట్టి చెంచాడు నెయ్యి వేయాలి. వేడెక్కాక జీడిపప్పు, పిస్తా, కిస్ మిస్ లను వేసి దోరగా వేయించి తీసేయాలి. తర్వాత మరో చెంచాడు నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయాలి. పచ్చి వాసన పోయేవరకూ వేయించి నీళ్లు పోయాలి. రవ్వ ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు అరటిపండు గుజ్జు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. నీళ్లు ఇగిరిపోయాక పంచదార వేయాలి. పంచదార కరిగి, పాకంలా అవుతున్నప్పుడు అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. దగ్గరగా అయిపోయాక జీడిపప్పు, పిస్తా, కిస్ మిస్ వేసి కలపాలి. ఆపైన యాలకుల పొడి చల్లి, మిగిలిన నెయ్యి వేసి దించేసుకోవాలి.

 

- sameeranj