బాదం పాయసం

 

 

కావలసినవి:
బాదం పప్పులు : ఒక కప్పు
పాలు : అర లీటర్
పంచదార : ఒకటిన్నర  కప్పు
కుంకుమ పువ్వు : చిటికెడు

 

తయారీ :
ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి ఒక గంట పాటు నాననివ్వాలి. తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేయాలి. తర్వాత బాదం పప్పులను మిక్సీలో వేసి, కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో  బాదం పేస్టును  వేసి  10 నిమిషాలు వేడి చేయాలి. తరువాత  చక్కెర వేసి ఇదు నిముషాలు కలపాలి. చిక్కగా అయిన తరువాత పాలు పోసి ఉడికించాలి. ఒక పది నిముషాలు ఉడికించుకోవాలి. పాయసం  చిక్కబడ్డాక చివరిలో కుంకుమపువ్వు వేసి వేడిగా లేక చల్లగానైన సర్వ్ చేసుకోవచ్చు...