బాదాం బాసుంది! 

 

కావలసినవి :-

బాదాం - ఒక కప్పు

పాలు - అరలిటర్

కోవా - 50 గ్రామ్స్

పంచదార 150 గ్రాములు

ఇలాచి పౌడర్ - ఒక స్పూన్ 

తయారుచేయువిధానం :-

ముందుగా బాదంను రాత్రి నీళ్ళల్లో నానా పెట్టాలి. నానిన బాదంను తొక్క తీసి గ్రైండ్ చేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగించి  అందులో బాదాం పేస్ట్ వేసి కలపాలి .తరువాత కోవా, పంచదార ఇలాచి పౌడర్ కూడా వేసి కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్  చేసి బౌల్ లో కి తీసుకుని ఫ్రిజ్ లో  రెండుగంటలు  ఉంచి సర్వ్ చేసుకోవాలి..