నవరాత్రులు ఐదవరోజు (అటుకుల పాయసం)
కావలసినవి:
అటుకులు - 100 గ్రాములు
బెల్లం - 100 గ్రాములు
నెయ్యి - 2 చెమ్చాలు
జీడిపప్పు, కిస్‌మిస్, యాలకులు - తగినన్ని
కొబ్బరి పాలు - ఒక కప్పు
తయారుచేసే విధానం:
ముందుగా బెల్లాన్ని సన్నగా తురుముకుని, కొద్దిగా నీరు పోసి కరిగేదాకా వేడిచేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి వేడి అయ్యాక అటుకులను వేయించాలి. అటుకులు కొంచెం రంగు మారితే చాలు. ఇప్పుడు కొబ్బరిపాలు వేసి ఉడికించాలి. అటుకులు మెత్తబడుతూ వుండగా బెల్లం పాకం, యాలకుల పొడి వేసి కలపాలి. ఒక పొంగు వచ్చేదాకా వుంచి దించాలి. ఆఖరున నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ కలిపితే అటుకుల పాయసం సిద్ధం.