అప్పాలు (వినాయక చవితి స్పెషల్)
కావలసిన పదార్థాలు:-
బియ్యంపిండి - 1కప్పు
బొంబాయి రవ్వ - 1/2కప్పు
పంచదార - 11/2కప్పు
యాలకుల పొడి - 1చెమ్చా
నీళ్లు - 11/2కప్పు
నెయ్యి - 3చెంచాలు
నూనె - తగినంత
తయారు చేయు విధానము:-
* ముందుగా, ఒక పాత్ర లో కప్పు నీళ్లు పోసి , అవి బాగా మరుగుతున్నప్పుడు, చెంచా నెయ్యి , యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత, చెక్కర వేసి ఒక్క్కసారి కలుపుకోవాలి.
* ఇప్పుడు బియ్యం పిండి ని బొంబాయి రవ్వని ఇక ప్లేట్ లోకి తీసుకుని, నెయ్యి రాసి ఉంచుకోవాలి. ఈ పిండి రవ్వ లను మరుగుతున్న నీళ్ళలో పోసి, గంటె తో కలుపుతూ, ఉండలు కట్టకుండా చూసుకోవాలి.
* ఇప్పుడు స్టవ్ ఆర్పేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
* ఇప్పుడు ఈ చక్కర, పిండి మరియు రవ్వ కలిసి ముద్దలా దగరికి వస్తుంది. దీన్ని చిన్న చిన్న ఉండలు గా చేసికోవాలి.
* ఇప్పుడు, బాండీ లో నూనె వేసి, నూనె కాగుతూవుంటే, ఒక్కక్క ఉండను, చిన్న పూరి పరిమాణం లో వత్తుకుని, నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
* ఈ అప్పాలను, బయటికి తీసి చక్కగా పళ్ళం లో వేసుకోవాలి.
* వీటిని, వినాయక చవితి నాడు నైవేద్యంగా గణేశుడికి సమర్పించుకోవచ్చు.
-Bhavana