చాక్లెట్ గులాబ్ జామున్ 

 

 

 

గులాబ్ జామున్ తయారు చేయడం తెలుసు. అయితే అదే గులాబ్ జామున్ ను చాక్లెట్ తో.. కొంచెం వెరైటీగా ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందా..

కావలసిన పదార్ధాలు:

జామున్ పొడి - 1 కప్పు

డైరీ మిల్క్ చాకలట్ - 1

పాలు

చక్కెర

నీళ్ళు

నూనె

తయారీ విధానం:

ముందుగ చాక్లెట్ ని తీసుకొని దానిని కొద్ది నీళ్లలో వేసి పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

తరువాత ఇలా పేస్ట్ లా చేసుకున్న చాక్లెట్ లో జామున్ పొడిని వేసి.. కొద్ది కొద్ది గా పాలు పోస్తూ ముద్ద లాగ కలుపుకోవాలి.

ఇలా చేసుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని.. ఒక బాణలి తీసుకొని అందులో సరిపడా నూనె పోసి ఉండలను వేయించిపెట్టుకోవాలి.

చక్కెర పాకం..

ముందుగ రెండు గ్లాస్ ల చక్కెర లో రెండు గ్లాస్ ల నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర మొత్తం కరిగే దాక కలుపుతూ ఉండాలి. కరిగిన తరువాత ఒక 5 నిముషాల సేపు ఉంచి ఆపేయాలి.

ఆఖరిగా వేయించి పెట్టుకున్న ఉండలను తీసి చక్కెర పాకం లో వేసి.. ఒక 5 నిముషాల పాటు ఉంచి తీయాలి. అంతే నోరూరించే చాక్లెట్ గులాబ్ జామున్ రెడీ.