అప్పాలు    (శ్రీరామ నవమి spl)

 

 

కావలసినవి :-

వరిపిండి                                           - 1 గ్లాసు
మైదా                                                 - 1 గ్లాసు 
బెల్లం                                                 - 1 గ్లాసు
కొబ్బరి కోరు                                        - 2 చెంచాలు 
నూనె                                                  - వేయించడానికి  సరిపడినంత 

 

తయారీ విధానం :-

దళసరి గిన్నెలో బెల్లం వేసి ఒక గ్లాసు నీరు పోసి పొయ్యిమీద పెట్టి మరుగుతున్నప్పుడు కొబ్బరి కోరు వేసి కొద్దిగా నూనె వేసి, మంట తగ్గించి  బియ్యం పిండి, మైదా కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. పొయ్యిమీద నుండి దింపి చల్లారనిచ్చి. చేతికి మరి కొద్ది నూనె రాసుకుని.

పిండి బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకొని.. మనకి కావలసిన సైజులో బిళ్ళలుగా ఒత్తుకోవాలి. అప్పాలు మరీ పలుచగానూ కాకుండా మరీ దళసరిగా కాకుండా సమానంగా ఒత్తుకుని కాగే నూనెలో దోరగా వేయించుకోవాలి. చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి.... అప్పాలు.. మైదా వాడద్దు అనుకుంటే .. బదులుగా గోధుమపిండితో తయారు చేసుకోవచ్చును.