- First Ever Tal National Badminton Championships
- 5th Tal Children’s Day Celebrations
- Tal Renovated Cp Brown Grave
- యువరత్న బాలకృష్ణ ముఖ్య అతిథిగా తాల్ ఉగాది వేడుకలు
- Tal Ugadi Celebrations On 31 March
- Tal Conducted Winter Sports
- 7th Tal Christmas Celebrations 2011
- Tal Has Participated Independence Day In London
- Tal Celebrates 5th Children's Day In London
- లండన్ తెలుగు సంఘం (తాల్)
- Tal 20-20 Cricket League
- తాల్ ఆధ్వర్యంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి 125 వ జయంతి
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే TAL ప్రీమియర్ లీగ్ (TPL) క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహించింది. మెగా ఫైనల్ మ్యాచ్‌లు 11 ఆగస్టు 2024 ఆదివారం నాడు ఇంగ్లాండ్ లో లాంగ్లీలోని స్లౌ క్రికెట్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ IT Tree వారియర్స్ మరియు కూల్ క్రూయిజర్స్ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా జరగగా మూడవ స్థానం కోసం వైజాగ్ బ్లూస్ మరియు DJ వారియర్స్ జట్లు తలపడ్డాయి.
ఛాంపియన్‌షిప్ విజేతలు మరియు ఇతర వివరాలు:
లియో గ్లోబల్ TPL 2024 ఛాంపియన్స్: IT Tree వారియర్స్, కెప్టెన్: ధనంజయ్ మద్దుకూరి, ఫ్రాంచైజీ ఓనర్: వికాస్ పర్రె
రన్నర్స్ అప్: కూల్ క్రూయిజర్స్, కెప్టెన్: సాయి పరశురామ్, ఫ్రాంచైజీ ఓనర్: శరత్ పుట్టా
3వ స్థానం: DJ వారియర్స్: కెప్టెన్: సాయి రామకృష్ణ హరిదాసు, ఫ్రాంచైజీ ఓనర్: శ్రీనివాస్ చెరుకు
మ్యాన్ ఆఫ్ ద సిరీస్: ఆకాష్ భండారి (IT Tree వారియర్స్)
ఉత్తమ బౌలర్: సాయి పరశురామ్ (కూల్ క్రూయిజర్స్)
ఉత్తమ బ్యాట్స్‌మెన్: ఆకాష్ భండారి (IT Tree వారియర్స్)
క్రీడలు మరియు ప్రత్యేకించి క్రికెట్‌లో మహిళలను ప్రోత్సహించడానికి తాల్ నిర్వహించిన ప్రత్యేక తెలుగు మహిళల క్రికెట్ మ్యాచ్ ఈ సంవత్సరం T10 తరహాలో నిర్వహించటం జరిగింది. నాలుగు మహిళా క్రికెట్ జట్లు, IT Tree వారియర్స్, వైకింగ్స్, తెలుగు టైగ్రెస్ & గెలాక్సీ గర్ల్స్ ఈ పోటీలలో పాల్గొన్నాయి. వైకింగ్స్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది.
300 మందికి పైగా హాజరయిన ఈ పోటీలలో పిల్లలకు, పెద్దలకు ఆటలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. తోటి తెలుగు కుటుంబాలతో కలిసి వినోదంతో నిండిన ఈ రోజును ఆస్వాదించారు. భారతదేశం మరియు బ్రిటన్ రెండింటి జాతీయ గీతాలతో ఈవెంట్ ప్రారంభమై ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సందర్భంగా సహాయ నిధులు సేకరించి ఇండియాలో నేషనల్ స్థాయిలో ఆర్చెరీలో రాణిస్తున్న యువ క్రీడాకారిణి విజయవాడ నివాసితురాలైన షణ్ముఖి నాగసాయికి ప్రోత్సహ సహకారాలు అందిస్తూ ఆర్చెరీకి సంబంధించిన కిట్ కొనుగోలుకై విరాళంగా చైర్మన్ రవి సబ్బ అందజేసారు.
తాల్ 16 సంవత్సరాల క్రితం 2008లో లండన్‌లో TAL క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో TAL ప్రీమియర్ లీగ్‌గా IPL ఫార్మాట్‌లో రూపాంతరం చెందిందని, UK అంతటా అనేక తెలుగు కుటుంబాలను కలుపుతూ యూరోప్‌లో కమ్యూనిటీ సంస్థచే నిర్వహించబడుతున్న అతిపెద్ద T20 క్రికెట్ లీగ్‌గా అవతరించిందని చైర్మన్ రవి సబ్బ తెలియజేసారు. TPL ను సమన్వయంతో సమయస్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించినందుకు కోఆర్డినేటర్ సత్య పెద్దిరెడ్డిని చైర్మన్ రవి సబ్బ ప్రశంసించారు మరియు టోర్నమెంట్ విజేతలు మరియు రన్నర్లను అభినందించారు. TAL మరియు TPLలకు అందించిన సహకారానికి తాల్ సలహాదారులు, తాల్ సబ్‌కమిటీతో పాటు ట్రస్టీలు, కిరణ్ కప్పెట, అనీల్ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, వెంకట్ నీల, రవి మోచెర్ల మరియు IT incharge రాయ్ బొప్పనలకు కృతజ్ఞతలు తెలిపారు.
పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ లో TPL కోఆర్డినేటర్ సత్య పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ సంవత్సరం 10 జట్లు 14 వారాల పాటు ఆడినట్లు, 200 మంది ఆటగాళ్లు 51 మ్యాచ్‌లు పూర్తి క్రీడా నైపుణ్యంతో మరియు ఆటలలో గొప్ప నాణ్యతతో ఆడారని అన్నారు. TPL-2024స్టీరింగ్ కమిటీ అనిత నోముల, వాసు మేరెడ్డి, వాలంటీర్ టీం: శరత్ పుట్టా, మునిందర్ కొప్పినీడు, రమేష్ ముత్యాల, హర్ష కాగితాల, ఆదిత్య సనపల, సూర్య కార్తీక్, సింధు శ్రీనివాస్, TPL సలహా బృందం: సంజయ్ బైరాజు, శ్రీధర్ మేడిచెట్టి, రవీందర్ రెడ్డి, కిరణ్ కప్పెట, క్రమశిక్షణా కమిటీ: వంశీ మోహన్ సింగూలూరి, శ్రీధర్ సోమిశెట్టి, శరత్ జెట్టి, భారతి కందుకూరి తదితరుల సహాకారంతో TPL – 2024 ఛాంపియన్‌షిప్‌ను ఇంత ఉన్నత ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.