EVENTS
తాల్ ఆధ్వర్యంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి 125 వ జయంతి

ప్రముఖ హేతువాద రచయిత, సంఘ సంస్కర్త, కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 వ జయంతి ఉత్సవాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో 28 మే 2011 న తాల్ సంస్కృతిక కేంద్రంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ మరియు డా. వెలగపూడి బాపూజి రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తాల్ పూర్వ చైర్మన్ రామానాయుడు ఆధ్యక్షత వహించారు.

డా. వెలగపూడి బాపూజి రావు తన ప్రసంగంలో కవిరాజు జీవితకాలం విశేషాలను వివరించగా, ఆచార్య యార్లగడ్డ కవిరాజు యొక్క హేతువాద ఉద్యమం గురించి వివరించారు. కులం, మతాన్ని త్యజించి సమాజంలో జంతు బలి నిషేధాన్ని అమలు పర్చడం ఈ ఆడవారికి సమాన హక్కులు కల్పించాలని చేపట్టిన ఉద్యమం, కవిరాజు గారి హేతువాద ఉద్యమ నేపధ్యాన్ని ప్రస్తుత పరిస్థితులకు ఏ విధంగా అన్వయించుకోవాలో ఆచార్య యార్లగడ్డ సోదాహరణంగా సభికులకు వివరించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని వివరించి దాన్ని మనం భావి తరాలకు అందించి కాపాడుకోవాలని ఆచార్య యార్లగడ్డ విజ్ఞప్తి చేసారు.

 తెలుగు భాష గొప్పతనాన్ని మరియు దాన్ని భావితరాలకు అందించవలసిన భాద్యతను తాల్ ట్రస్ట్ కందుకూరి సూర్య, తాల్ సాంస్కృతిక కార్యదర్శి మ్యాకల రాజిరెడ్డి లు వివరిస్తూ లండన్ లో నివసిస్తున్న తెలుగు తల్లిదండ్రులకు తమ పిల్లలను తాల్ సాంస్కృతిక కేంద్రంలో చేర్పించి తెలుగు బాష నేర్పించవలసిందిగా కోరారు.

తాల్ కార్యవర్గం హాజరైనవారందరికి ధన్యవాదాలు తెలిపింది.


TeluguOne For Your Business
About TeluguOne
;