RELATED ARTICLES
ARTICLES
దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం

 

దక్షిణ కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట పోటి లాస్ ఏన్జేలీస్ నగరంలో May 30న, సాన్డియాగో నగరంలో June 6న నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో 90 మందికి పైచిలుకు పిల్లలు తెలుగు భాషలోని లాలిత్యాన్ని, మన సంస్కృతిలోని తియ్యదనాన్ని మేళవించి భాషా వికాసంతో, వినోదాన్ని అందిస్తూ, తెలుగు భాషపై వారి పట్టుని ప్రదర్శించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ పోటీల సందర్భంగా పిల్లలు పదరంగం, తిరకాటం, ఒ.ని.మా (ఒక్క నిమిషం మాత్రమే) అన్న ఆటలు ఆడారు. పదరంగం విభాగంలో బాలబాలికలు తాము విన్న కఠిన పదాలని వ్రాశారు. తిరకాటం అంశంలో తెలుగుతనానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఒ.ని.మా విభాగంలో పిల్లలు ఒక నిమిషం పాటు అంగ్ల పదాలు వాడకుండా తెలుగులోనే మాట్లాడారు. పోటీల అనంతరం గెలిచిన బాల బాలికలకు బహుమతి ప్రదానం జరిగింది.

 

లాస్ ఏన్జేలీస్ విభాగం:

బుడతలు (వయోవిభాగం: 5-9 ఏళ్ళు) :

పదరంగం: 
మొదటి బహుమతి - రియ కోమటిరెడ్డి
ద్వితీయ బహుమతి - శ్రీలలిత నారిశెట్టి


తిరకాటం:

మొదటి బహుమతి - స్నిగ్ధ అగస్త్యరాజు
ద్వితీయ బహుమతి - అశొక్ గరికపాటి

సిసింద్రీలు (వయోవిభాగం: 10-13 ఏళ్ళు) :

పదరంగం: 

మొదటి బహుమతి - సంకీర్త్ ఊటుకూరి
ద్వితీయ బహుమతి - అనీష్ యువసాయి కంచర్ల 

తిరకాటం :

మొదటి బహుమతి - సమీక్ష కోమటిరెడ్డి
ద్వితీయ బహుమతి - బాల కౌశిక్ వజ్రాల

శాండీయాగో విభాగం:
బుడతలు (వయోవిభాగం: 5-9 ఏళ్ళు):

పదరంగం:

మొదటి బహుమతి - విధ యాదవ్ గంజి
ద్వితీయ బహుమతి - శ్రీక పోపురి

తిరకాటం: 

మొదటి బహుమతి  - విభ యాదవ్ గంజి
ద్వితీయ బహుమతి - సింధు నరసింహ & శబ్దిక గుబ్బ 

సిసింద్రీలు (వయోవిభాగం: 10-13 ఏళ్ళు):

పదరంగం:

మొదటి బహుమతి - తరుణీ మానం
ద్వితీయ బహుమతి - అక్షిత్ ప్రత్తిపాటి

తిరకాటం: 


మొదటి బహుమతి - ధన్య జక్కుల
ద్వితీయ బహుమతి - వైష్ణవి కుప్ప

 



ఈ పోటీలు దక్షిన కాలిఫోర్నీ మనబడి విభాగం సమన్వయకర్త, తెలుగు మాట్లాట సంధాత డాంజి తోటపల్లి నేతృత్వంలో, లాస్ ఏన్జేలీస్ నగరంలో శ్రీధర్ బండ్లమూడి, కాంతి దర్భల, సుమన్ తోడేటి మరియూ సాన్డియాగో నగరంలో హేమచంద్ర తలగడదీవి, మహేష్ కోయ, రవికిరణ్ ముప్పాళ్ళ, వెంకట్ జక్కుల సమిష్టి కృషితో, మోహన్ కాటగడ్డ, సిద్దు యాదళ్ళ, లక్ష్మి రుద్రరాజు, రాజి జక్కుల, ప్రదీప్ శాఖమూరి, రీనా శాఖమూరి, శ్రీకర్ తలగడదీవిల సేవసహకారంతో జరిగాయి. ఈ సందర్భంలో డాంజి తోటపల్లి గెలిచిన పిల్లలకు అభినందనలు తెల్పుతూ,  తెలుగు మాట్లాట ఫైనల్ పోటీలు టెక్సాస్ రాష్త్రంలోని డల్లాస్ నగరంలో సెప్టెంబరు 4 & 5న జరుగుతాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో అమెరికాలో 4300 మంది విద్యార్థులులో దక్షిన కాలిఫోర్నియాలోని 16 నగరాలనుండి 500పైగా విద్యార్థులు ఉన్నారని, వచ్చే విద్యా సంవత్సరంలో మనబడి తరగతులు సెప్టెంబరు 12 నుండి ప్రారంభమవుతాయి అని తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;