RELATED ARTICLES
ARTICLES
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో APNRTS సమావేశం విజయవంతం

 

 

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో APNRTS సమావేశం విజయవంతం 



క్యాలిఫోర్నియా : ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రవాసాంధ్రులకు ప్రభుత్వానికి వారధిగా ఏర్పాటు చేయబడిన APNRTS, వారి కార్యకలాపాలను, ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను వివరించే ఆత్మీయ సమావేశం, ఆదివారం నాడు మిల్పిటాస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భవనం లో  జరిగింది. APNRTS అద్యక్షులు డాక్టర్ రవి వేమురి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సమావేశానికి సిలికానాంధ్ర వ్యవస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల అద్యక్షత వహిస్తూ, APNRTS అద్యక్షులు రవి వేమూరి ని సభకు పరిచయం చేసారు. 

APNRTS అద్యక్షులు డా. రవి వేమూరి, మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తించి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఈ APNRTS ని ఏర్పాటు చేసారని, ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున ఈ సంస్థలొ  సభ్యులుగా చేరి గ్రామాలను దత్తత తీసుకోవడం, గ్రామాభివృద్ధి పనులకు సహకారం అందించడం ద్వారా, రోడ్లు, పాఠశాలల అభివృద్ధి, మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. APNRTS సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకి, RIDF Funds అందించే మాచింగ్ గ్రాంట్ ద్వారా, 50% నిధులు కేటాయింపు జరిగేలా చూస్తామని, RIDF ఫండ్స్ ద్వారా 100 కోట్ల రూపాయల మాచింగ్ గ్రాంట్లతో గ్రామాల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలపై పలు ప్రశ్నలకు సమాధానలు అందించి, ప్రవాసాంధ్రులకు APNRTS కార్యకలాపాలపై అవగాహన కలిగించారు.


ఈ సందర్భంగా, జనవరి 2017 లో ప్రారంభం కానున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కూచిపూడి, కర్ణాటక సంగీతం విభాగం లోని సర్టిఫికేట్, డిప్లొమా, పీ జీ కోర్సుల కు సంబంధించిన బ్రోచర్ లను, రవి వేమూరు ఆవిష్కరించారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భవనానికి భూరి విరాళం అందించిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పేర్లతో కూడిన విద్యుత్ కాంతులీనే నామఫలకాలను లకిరెడ్డి సిద్దార్ధ ఆవిష్కరించారు. కార్తీక పౌర్ణిమ సందర్భంగా సిలికానాంధ్ర ఆడపడుచులు వెలిగించిన దీపాలు ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.  

కార్యక్రమంలో సిలికానాంధ్ర మరియు విశ్వవిద్యాలయ కార్యవర్గ సభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, APNRTS సభ్యులు ప్రసాద్ పువ్వల, బుచ్చి రాం ప్రసాద్ కలపతపు తదితరులు పాల్గొన్నారు.

 

  

TeluguOne For Your Business
About TeluguOne
;