- సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో నాట్యకీర్తనం
- అమెరికా,కెనడాలలో 'తెలుగుకుపరుగు' నిర్వహించిన సిలికానాంధ్ర మనబడి
- ఉత్సాహభరితంగా మనబడి పిల్లల నాటకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షలు !
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో అమరావతి భాషా శాస్త్ర పీఠం
- సిలికానాంధ్ర ఆధ్వర్యంలో Apnrts సమావేశం విజయవంతం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - Wasc గుర్తింపు - పత్రికా ప్రకటన
- అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద
- క్యాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా 10వేలమందికి పైగా విద్యార్ధులతో సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన
భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
సిలికాన్ వ్యాలీ: అమెరికాలోని భారత రాయబారి అంబాసడర్ నవ్‌తేజ్ సర్నా తొలిసారి కాలిఫోర్నియా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఇండియన్ కాన్సుల్ జెనరల్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ మరియు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం వేదికయింది. బే ఏరియాలోని వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, మరియు వివిధ రంగాలలో భారతదేశంలోను, అమెరికాలోను సామాజిక సేవ చేస్తున్న ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీ నవ్‌తేజ్ సర్నా మాట్లాడుతూ, భారతీయులెందరో వివిధ రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ అటు అమెరికా అభివృద్ధికి భరతదేశ అభివృద్ధికి కృషి చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు.ఈ సందర్భంగా ప్రఖ్యాత క్రికెటర్ బీ ఎస్ చంద్రశేఖర్, వంటి ప్రముఖులను, సామజిక సేవ చేస్తున్న భారతీయ ప్రముఖులను కాన్సులేట్ తరఫున భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా సత్కరించారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సీ ఈ ఓ ఆనంద్ కూచిభొట్ల, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ లక్ష్యాలు, ప్రణాళికలు, విజయాలను వివరించి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తరఫున నవ్‌తేజ్ సర్నాను సాంప్రదాయరీతిలో సత్కరించారు.
సిలికానాంధ్ర వైస్ చెయిర్‌మెన్ దిలీప్ కొండిపర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ఇండియన్ కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్, కాన్సుల్ అధికారి శ్రీ కూచిభట్ల వెంకట రమణ మరియు కాన్సుల్ ఇతర అధికారులు ఎంతగానో సహకారించారు. భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాల ప్రదర్శనలతో కార్యక్రమం ప్రారంభమవగా, కార్యక్రమానంతరం ఆహూతులకు విందు భోజనాలు ఏర్పాటు చేసారు.