అమెరికా తెలుగు సంఘం (ATA) వారు డాలస్ లో ఉన్న గ్రేప్ వైన్ గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలో దాదాపు అరవై మంది డాలస్ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతగా స్పీచ్ సాఫ్ట్ కి చెందిన జె పి రడ్డి వ్యవహరించారు. ఆటా వారు తలపెట్టిన 'Adopt a Village' కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాకి చెందిన అంకిరెడ్డిపల్లెకి ఈ కార్యక్రమంలో సమకూరిన నిధులను అందజేస్తారు.
అరవింద్ రెడ్డి ముప్పిడి, శ్రీనివాస్ పిన్నపురెడ్డి, సంధ్య గవ్వ, అనంత్ పజ్జూర్, సతీశ్ రెడ్డి, రఘువీర్రెడ్డి, ధీరజ్ ఆకుల మొదట టీ లో ఆటని ప్ర్రరంభించారు. ఆట ముగిసిన తరువాత విజేతలకి ట్రాఫీలు హనుమంత రెడ్డి, గోర్డాన్ గివెన్స్, శ్రీనివాస్ పిన్నపు రెడ్డి, సంధ్య గవ్వ అంద జేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను ఆటా కార్య వర్గం స్పాన్సర్ జేపీ రెడ్డికి మరియు ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్తులకి ఉపయోగపడే కార్యక్రమం చేపట్టినందుకు ఆటా సంస్ఝ్తకి పలువురు అభినందనలు తెలియ జేశారు. 2013 జూలై 3-5 రొజుల్లో ఫిలడెల్ఫియాలో జరగబోయే ఆటా సమావేశాల కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.