ARTICLES
TAGC మరియు ATA ఆద్వర్యంలో ఘనంగా దసరా & బతుకమ్మ ఉత్సవాలు

 

 

 

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో(TAGC) మరియు ఆమెరికన్ తెలుగు అసోసియేషన్(ATA)  వారి ఆద్వర్యములో ప్రవాసంద్రులు దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇల్లినొఇస్ రాష్ట్రం నలుమూలల నుండి 500 పైగా తెలుగువారు చికాగో లోని ఆరోర వెంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో బతుకమ్మ మరియు దసరా పండుగలను శనివారం రోజు (10/12/2013) చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు అత్యంత ఉత్సాహంతో ఘనంగా జరిగాయి.

 

 

 

 

మధ్యాహ్నం భోజనం తరువాత చిన్నారులు, మహిళలు సాంప్రదాయబద్దంగా పట్టవస్త్ర్రాలు ధరించి, అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలతో చికాగో వాసులకు కన్నుల విందు చేసారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రము వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలతాళాలు, భజంత్రిలతో గుడికొలనులో వదిలారు.  ఈ  పండుగకు  రేలారెరేలా రవి ప్రత్యేక ఆకర్షనగా నిలిచి తన గీతాలతొ అందర్ని అలరించారు. రవి బతుకమ్మ గీతాలతో అందరిని హుషారు ఎత్థించారు. TAGC మరియు ATA స్పాన్సర్ చేసిన బతుకమ్మ (3ft x3ft) అమెరికాలోనే అతి పెద్దదిగా చెప్పొచ్చు. ఈ వేడుకకు అవసరమైన పుష్పాలను ప్రత్యేకంగా Fancy Floirist, NJ నుండి తెప్పించారు. పద్మ మాదిరెడ్డి, జ్యోతి చింతలపాని, సుజాత అప్పలనేని ఆద్వర్యంలో ఈ అతి పెద్ద బతుకమ్మను చేశారు. ఈ అతిపెద్ద బతుకమ్మను మినహాయించి మిగతా బతుకమ్మలలో సిరిష సరికొండ, స్రీలత పర్వతాల, ప్రనిత  కందిమల్లలు చేసిన బతుకమ్మలను ప్రథమ, ద్వితీయ, తృతీయ పెద్ద బతుకమ్మలుగా ఈక్రమంలో ఎంపిక చేశారు. వీటికి భారతి పుల్లూర్, వనజ నెట్టెం, శ్రీదేవి దొంతిలు న్యాయనిర్ణేతలు గా వ్యవహరించారు. ఈ బహుమతులను న్యూ యార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు sponsor చేసి, ఆటా వ్యవస్థాపకులు హన్మంత్ రెడ్డి మరియు మాధవ రెడ్డి గార్ల చేతులమీదుగా అందచేశారు. వీటితో పాటు ప్రతి బతుకమ్మకు భారతదేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన  దేవి విగ్రహాలను  TAGC అద్యక్షులు రమేష్ గారపాటి అందచేశారు.

 

 



సాయంత్రము గుడి పూజారి,  వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి ఆయుధ పూజ చేసారు. వచ్చిన వారందరకి కంకణాలు కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. వచ్చిన వారందరూ జమ్మిఆకులను పంచి పరస్పరం ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారత దేశంలోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.




తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (TAGC ) అద్యక్షులు రమేష్ గారపాటి,  ఆటా(ATA ) అద్యక్షులు కరుణాకర్ మాధవరం,  ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బతుకమ్మ, దసరా సంబరాలకు విందు భోజనాలను సమకూర్చిన కూల్ మిర్చి, స్వీట్స్ స్పాన్సర్ చేసిన సునీత మట్ట, పూజాఫలాలు స్పాన్సర్ చేసిన Ceramic Fresh Market లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.



 
ఈ వేడుక విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన జ్యోతి చింతలపని, పద్మ మాదిరెడ్డి, ఆటా (ATA ) కోశాధికారి నరేందర్ రెడ్డి చేమర్ల,  ఆటా (ATA) Regional Coordinator శ్రీనివాస్ మట్ట , ఆటా (ATA) BOT సత్య కందిమళ్ళ, TAGC Secretary సుజాత అప్పలనేని  TAGC President-Elect శ్రీనివాస్ పెదమల్లు, TAGC BOTs అంజి కందిమళ్ళ, ప్రదీప్ కందిమళ్ళ,  జగన్ బుక్కరాజు,  రామ్ అదే, హరి రైనీ, శివ పసుమర్తి, శ్రీనివాస్ బొమ్మినేని, అమర్ నెట్టెం  మరియు శ్రీనివాస్ సరికొండ, శ్రీనివాస్ చాడ లను అభినందించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;