జగన్ అరెస్టు చేస్తే ఏమవుతుంది?
posted on May 26, 2012 2:33PM
“జగన్ అరెస్టు చేస్తే ఏమవుతుంది?” రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎవరి నోట విన్న ఇదే మాట. ఎక్కడ ఇద్దరు గుమ్మికూడిన ఇదే చర్చ. వ్యాపారాలలో మునిగి తెలేవారు... ఆఫీసులలో పనిచేసే వారు గంట గంటకి మిత్రులకు, ఇళ్లకు ఫోన్ చేసి ఏమైంది? అంటూ వివరాలు అడిగి తెలుసుకొంటున్నారు. జగన్ ను ఎన్నికల వరకు అరెస్టు చేయరని....... ఎన్నికలతో సంబంధం లేకుండా 28 లోపు అరెస్టు చేయడం ఖాయం అంటూ ప్రజలు ఎవరి లాజిక్ తో వారు చర్చించుకొంటున్నారు. జగన్ అరెస్టు వల్ల సానుభూతి పెరిగి ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతుందని భావిస్తుంటే. సిబిఐ అరెస్టు చేయడం జరిగితే జగన్ నేరస్థుడని నిర్ధారించినట్టే అటువంటప్పుడు ప్రజలు జగన్ ను తిరస్కరిస్తారే కాని. ఓట్లు ఎందుకు వేస్తారని మరికొందరు అంటున్నారు.మొత్తంగా రోహిణి కార్తె ప్రవేశించి రాష్ట్రంలో ఎండలతో మండిపోతున్నా జగన్ అరెస్టు పై ఏర్పడిన ఉత్కంటతో ప్రజలు ఎండను కూడాపట్టించుకోవడం లేదు.
.jpg)
“కూత నేర్పినోడి కులం కోకిలంటరా.... ఆకలేసి అరిసెటోడిని కాకులంటరా?” అని ఒక సినిమా కవి అన్నట్టు తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్ల రూపాయలు )లక్ష రూపాయలని ఒక అంచనా) అక్రమంగా సంపాదించిన విషయం జగమెరిగిన వాస్తవం. సిబిఐ కూడా చార్జీషీటులో ఎ 1 ముద్దాయిగా జగన్ నే పేర్కొంది. అక్రమ ఆస్థుల సంపాదన అనే సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వంతోపాటు హీరో కూడా జగనే. నిర్మాత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ఇక మంత్రులు, ఐఎస్ ఎస్ అధికారులు సినిమా నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించే నిపుణుల వంటి వారే. ఇంకా చెప్పాలంటే జగన్ నాటకంలో కేవలం మీరు పావులు మాత్రమే. ఇటువంటి స్థితిలో సిబిఐ నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. నిందితులను కుల ప్రాతిపదికన కాకుండా నిందుతులందరిపట్ల ఒకే విధంగా వ్యవహరించాలి. రాజకీయ ఒత్తిడులకు లొంగి వివక్షత పాటించే పక్షంలో సిబిఐ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం వుంటుంది.