సబితకో న్యాయం. మోపీదేవికో న్యాయమా?
posted on May 26, 2012 2:05PM
సిబిఐ విచారణలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఒకే విధమైన సమాధానం చెప్పినా చర్యలు రెండు రకాలు వున్నాయి. “రమణా.... అంతా నేను చూసుకొంటా.. భాను (సి ఎం పేషి అధికారి) చెప్పునట్టు సంతకం చేయి" అంటూ నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయంగా చెప్పి, సి ఎం కార్యాలయంలోనే ఫైల్ పై తనతో సంతకం చేయించారని, అందువల్ల తనతప్పు లేదని మంత్రి మోపిదేవి సిబిఐ విచారణలో వివరించారు. మైనింగ్ శాఖ మంత్రిగా వున్న సబితా ఇంద్రారెడ్డి కూడా మైనింగ్ జి.వో. పై )”క్యాపిటీవ్" అనే పదం తొలగించి) ఐఎఎస్ అధికారిని శ్రీలక్ష్మి సంతకం చేయమంటేనే సంతకం చేశానని (అయితే సబిత మాటలను శ్రీలక్ష్మి ఖండించిన విషయం తెలిసిందే), అక్రమాలలో తనప్రమేయం ఏదీలేదని సిబిఐ విచారణ సమయములో తెలిపారు.
సిబిఐ ఆమెను అరెస్టు చేయలేదు. మోపిదేవి కూడాముఖ్యమంత్రి సంతకం చేయమంటనే సంతకం చేసానని తనప్రమేయం ఏదీ లేదని చెప్పారు. అయినా సిబిఐ ఆయనకు అరెస్టు చేయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఇరువురూ విచారణలో ఒకే విధమైన సమాధానం చెప్పారు. కాని సిబిఐ అధికారులు సబితను వదిలి. మోపిదేవిని మాత్రమే అరెస్టు చేయడంలో వివక్షత స్పష్టంగా కనిపిస్తోంది. సిబిఐ కథనం ప్రకారం నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఎదురు చెప్పలేక, ఆయన మాట ప్రకారం సంతకాలు చేసిన మంత్రులలో మోపిదేవితోపాటు సబితాఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు, వీరిపట్ల సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తోంది చూడాలి.