పదవులిస్తేనే పార్టీలో వుంటారా?
posted on May 26, 2012 2:49PM
“రాజ్యసభ సీటు అడిగాను ఇవ్వలేదు.... ఎం ఎల్ సి అడిగాను అదికూడా ఇవ్వలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళుతున్నాను" కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వై ఎస్ సోదరుడు వై ఎస్ వివేకానంద రెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఇవి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ కంటే అక్కడ పదవులు ఇవ్వలేదు కాబట్టి........ ఈ పార్టీలో చేరుతున్నానని బహిరంగం ప్రకటించడం చూస్తుంటే నీతి నియమాలతో సంబంధం లేకుండా పదవులు ఏపార్టీ వారు ఇస్తానంటే ఆ పార్టీలో చేరతానని చెప్పినట్టుగా అనిపిస్తోంది. పదవులు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని.... ప్రకటించడం కాకుండా కనీసం మరేదైనా కారణం చెప్పి బయటకు వచ్చి వుంటే బాగుండేదని కడప ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం వివేకానందరెడ్డిని..... జగన్ ను వేరుగా చూడలేమని, వారంతా ఒకటేనని, వివేకా కాంగ్రెస్ పార్టీలో వుండటంవల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అని అంటున్నారు. మొత్తంగా రాజకీయాలంటే ప్రజాసేవ కాదు. లాభనష్టాలను చూసుకొనే ఒక వ్యాపారమని నాయకులు చెప్పకనే చెబుతున్నారు.