సంతోషానికి సిగ్నేచర్ ఈరోజే..

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. వారి మాట నీటిమూట కాదు. ప్రపంచ దేశాలే సంతోషం మనిషి హక్కు అని నినదిస్తున్నాయి. సంతోషంగా ఉండటానికి దనికులుగానే పుట్టక్కర్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ప్రస్తుతకాలంలో కనీస నిత్యావసరాలు తీరాలన్నా ధనం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బు లేకుండా సంతోషం అనివార్యమైన విషయం. ఇకపోతే సంతోషం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి ప్రాథమిక హక్కు. దాన్ని సాధించుకోవడం మనిషి కర్తవ్యం అయితే.. ప్రజలకు సంతోషాన్ని అందించడం ఆయా దేశాల కర్తవ్యం. ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉండాలని, ఆ సంతోషం పెంపుదలకు ఎన్నో నిర్ణయాలు, మరెన్నో ప్రణాళికలు అమలుచేయాలని నిర్ణయించారు. సంతోషమైన ప్రపంచం కోసం ఒక రోజును వరల్డ్ హ్యాపీనెస్ డే గా ప్రకటించి జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 20 వ తేదీన ఈ సంతోషకరమైన దినోత్సవం జరుపుకోబడుతుంది.

ఐక్యరాజ్యసమితి 160 దేశాలకు చెందిన వ్యక్తులతో యాక్షన్ ఫర్ హ్యాపీనెస్ అనే గ్రూప్ లాభాపేక్షలేకుండా చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ  అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని అంతిమ లక్ష్యం ఏమిటంటే, పురోగతి అనేది దిగువ స్థాయిలను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మాత్రమే కాదు, ప్రజల శ్రేయస్సు, మనుషుల ఆనందం కూడా ఉండాలి. అప్పుడే అది సంతోషం అని పిలవబడుతుంది. 2011లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇది ఆర్థిక అవకాశాలకు సమానమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని ప్రాథమిక మానవ లక్ష్యంగా చేసింది.  రెండు సంవత్సరాల తరువాత, 2013లో, ఐక్యరాజ్యసమితిలోని  మొత్తం 193 సభ్య దేశాలు ప్రపంచంలోని మొదటి అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకున్నాయి మరియు అప్పటి నుండి అది పెరుగుతూనే ఉంది.

ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ సంతోష దినోత్సవ వేడుక నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవ లక్ష్యాల ప్రకారం.. సంతోషం మనిషి నవ్వు ద్వారా.. చర్యల ద్వారా వ్యక్తమయ్యేది కాట్రమే కాదు.. సంతోషమంటే వ్యక్తి జీవితంలో అభివృద్ధి. ఆ అభివృద్ధి వ్యక్తి జీవితాన్ని పెరుగుపరచాలి. ఇలా ఉన్నపుడే సాధారణ పౌరులు కూసా సంతోషంగా ఉండగలుగుతారు.

ఇకపోతే వ్యక్తి జీవితంలో తృప్తిగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. తృప్తి ఉన్నచోట సంతోషం నీటి ఊటలా బయటకొస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈ సంతోషం మరింత మెరుగు పడాలని ఆశిద్దాం.

                                    ◆నిశ్శబ్ద.

Related Segment News