కోపం చల్లారడానికి ఉత్తమమైన మార్గం.. రవిశంకర్ గురూజీ చెప్పిన ట్రిక్ ఇదిగో..!



తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.  కోపం  అనేది ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన గుణమే అయినా కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు చాలా విషయాలలో నష్టాలు ఎదురుచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి వాళ్ల దగ్గర కోపం చూపించినా మహా అయితే మాట్లాడకుండా పోతారు. కొందరైతే చెడ్డవారనే ముద్ర వేస్తారు.. కానీ కుటుంబ సభ్యులు,  అన్నింటి కంటే ముఖ్యంగా జీవిత భాగస్వాములు కోపం వల్ల జీవితంలో కోలుకోలేని,  తిరిగి పూడ్చలేని నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది.  అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని అంటారు.  అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి అని అనుకున్నంత సులువగా దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడమే పెద్ద సమస్య.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.. లైఫ్ కోచ్ అయిన రవిశంకర్ గురూజీ కోపాన్ని జయించడానికి, కోపంతో ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలను స్పష్టంగా తెలిపారు.


సైలెంట్ అయితే కోపం పెరుగుతుందా..?


వివాహ బంధంలో సరైన భాగస్వామి దొరకకపోతే కోపం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోతే అవతలి వారి కోపం కంట్రోల్ కాదు.. ఫలితంగా . కోపం పెరుగుతుంది. కోపం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయి సమయాన్ని వృథా చేయకూడదు. అవతలి ఏదైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా అవాయిడ్ చేయకూడదు. ఇది చాలా తప్పు.


కోపం ఇలా కంట్రోల్..

మీరు ఎంత చెప్పినా సరే.. ఎదుటి వ్యక్తి కోపం తగ్గకపోతే దీనికోసం చేయవలసిన పని కోపంగా ఉన్న వ్యక్తికి అర్థం అయ్యేలా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండే వ్యక్తిని సంప్రదించడం.మూడవ వ్యక్తి సహాయంతో కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ సక్రమంగా సాగకపోతే  కోపగించుకునే అవకాశం ఉంది.  కానీ అర్థమయ్యేలా ఎవరో ఒకరు వివరిస్తే అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి.


మూడో వ్యక్తి ప్రమేయం మంచిదేనా?

సాధారణంగా భార్యాభర్తలు కానీ.. కుటుంబ సభ్యులు కానీ వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మూడవ  మనిషి ప్రమేయం ఉంటే ఇష్టపడరు. కానీ భాగస్వామి కానీ, కుటుంబంలో వ్యక్తి కానీ ఏదైనా చెప్పాలని చూసినప్పుడు అవతలి వ్యక్తి వినకుంటే.. మీరు చెప్పేది మంచి విషయమే అయినా అప్పటికే మీ మీద ఉన్న కోపం వల్ల  మీరు చెప్పే మంచి కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అలాంటి సందర్బంలో మూడవ వ్యకి సహాయం తీసుకోవడమే మంచిదట. అయితే భార్యాభర్తలు ఎప్పుడూ ఇలా మూడవ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుకోకూడదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా ఇద్దరూ కలసి ఓపెన్ గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడమే మంచిది.


ఇది కూడా ట్రై చేయవచ్చు..

ఎవరైనా చాలా కోపంగా ఉంటే వారు నిశ్శబ్దంగా ఉంటే..  వారిని గౌరవించి మీరు కూడా  నిశ్శబ్దంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉంటే కోపంగా ఉన్న వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి సమయం లభిస్తుంది.   అతను తనంతట తానుగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కోపంగా ఉన్న సమయంలో  ఎటువంటి తప్పు అడుగు వేయకుండా జాగ్రత్త పడాలి.  ఇకపోతే.. ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకోవడం బంధాలకు..  ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల గొడవలు జరిగినప్పుడు.. కోపంగా ఉన్నప్పుడు  ప్రశాంతంగా ఉండటం,  ఎదుటివారి కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయడం మంచిది.  


                                           *రూపశ్రీ.
 

Related Segment News