కాలుష్యపు దెబ్బకు రీసైక్లింగ్ మందు...
posted on Mar 18, 2023 9:30AM
ప్రతి సంవత్సరం, భూమి బిలియన్ల టన్నుల సహజ వనరులను ఇస్తోంది. ఇలా ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులం. కానీ ఈ సహజవనరుల గురించి ఆలోచించాల్సింది మరొకటి ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సహజవనరుల అన్నీ భవిష్యత్తులో ఏదో ఒకప్పుడు అయిపోతాయి. ఇలా సహజ వనరులు అయిపోవడానికి కారణం.. కేవలం మనం సహజవనరులను ఇష్టానుసారం వాడెయ్యడమే కాదు. ఆ సహజవనరుల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూ.. వాటిని ప్రకృతికి నష్టం కలిగిస్తున్నాం.
అందుకే మనం ఈ ప్రకృతిలో కలిపేసే వస్తువుల గురించి మరోసారి ఆలోచించాలి - వృధా కాకుండ చూడాలి.
గత పదేళ్ల కాలం గమనిస్తే.. రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉంది. ఇప్పుడు అసమానమైన వాతావరణ మార్పులు, ఊహించని ప్రళయాలు ఎదుర్కొంటున్నాము. మనం గణనీయమైన, వేగవంతమైన మార్పులు చేయకుంటే, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, మంచుగడ్డలు కరగడం, వివిధ దేశాలు, ప్రాంతాలు అంతమయ్యే దశకు చేరుకోవడం, అడవులు తగ్గిపోవడం వంటివి చాలా దారుణంగా తయారవుతాయి.
ప్రపంచంలో పెరుగుతున్న పేదరికం, ప్రాంతాల వలసలు, ఉద్యోగ నష్టాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కనుమారుగైపోతూ.. కరువు కారణంగా ప్రపంచమంతా దారిద్య్రం ఏర్పడుతుంది. మానవాళిని ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి శాశ్వతమైన మార్పులు చేసుకోవాలి. దీనికోసం ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రీసైక్లింగ్ డే ని ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన జరుకునేలా ప్రకటించింది. 2030 నాటికల్లా.. కొన్ని లక్ష్యాలను ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా నిర్ణయించింది. గ్లోబల్ గ్రీన్ ఎజెండాకు మద్దతుగా అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం మనం ఇప్పటికే చూస్తున్నాము.
రీసైక్లింగ్ అనేది వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం, ఇది మన సహజ వనరులను రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం 'సెవెన్త్ రిసోర్స్' (పునర్వినియోగపరచదగినవి) CO2 ఉద్గారాలలో 700 మిలియన్ టన్నులకు పైగా ఆదా చేస్తుంది. ఇది 2030 నాటికి 1 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయబడింది. మన భవిష్యత్తును కాపాడటానికి మనుషుల్లో ఉన్న స్పృహ రీసైక్లింగ్ ప్రక్రియలో ముందు వరుసలో ఉంటుంది. అంటే.. భావితరాలకు మనం సహజవనరులను అందించాలనే స్పృహ మనతో ఈ ప్రకృతి సంరక్షణ పనులు చేయిస్తుంది.
మన విలువైన ప్రాథమిక వనరులను సంరక్షించడం, మన భూ గ్రహ భవిష్యత్తును సురక్షితం చేయడంలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను చాలా ఉంటుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించడంలోనే ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకోబడుతుంది. అందుకోసమే.. 2018లో గ్లోబల్ రీసైక్లింగ్ డే సృష్టించబడింది. ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలకు తగిన ఆలోచనలు, ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పడం గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు చేసే పని.
గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్దేశించబడిన గ్లోబల్ రీసైక్లింగ్ డే లక్ష్యం రెండు రెట్లు:
రీసైక్లింగ్ అనేది గ్లోబల్ సమస్య కాకూడదని, ఇది చాలా ముఖ్యమైనదని చెబుతారు. ఈ రీసైక్లింగ్‌కు ఒక సాధారణ, ఉమ్మడి విధానం తక్షణం అవసరమని ప్రపంచానికి తెలిసేలా చెప్పడం.
మన చుట్టూ ఉన్న వస్తువుల విషయానికి వస్తే, వనరులను వృధా చేయకూడదని ఈ భూమ్మీద ఉన్న అందరూ ప్రజలకు తెలియజేయడం.
అవార్డులు రివార్డులు ఉన్నాయి దీనికి..
గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ రంజిత్ బాక్సీ ఇలా వ్యాఖ్యానించారు. “కరోనా కాలంలో రీసైక్లింగ్ హీరోలు చేసిన విశిష్ట సహకారానికి మేము వారిని గుర్తించాలనుకుంటున్నాము. గత 12 నెలల్లో రీసైక్లింగ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న వ్యక్తులు, సంఘాలు, వ్యాపారాల నుండి నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. వారి ప్రయత్నాలు మన ప్రపంచం యొక్క పచ్చని భవిష్యత్తుకు దోహదపడతాయి.
రీసైక్లింగ్ అనేది వాతావరణ మార్పు చక్రంలో అంతర్భాగం. ప్రపంచ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో, రక్షించడంలో సహాయపడుతుంది. రీసైక్లింగ్ 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల CO 2 ఉద్గారాలను ఆదా చేస్తుందని అంచనా వేయబడింది . ఈ అవార్డు కింద 1000 అమెరికన్ డాలర్లు బహుమానంగా ఇస్తారు.
కలుషితమైపోతున్న ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం మన చేస్తుల్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న వనరులను దీర్ఘకాలంగా, పొదుపుగా ఉపయోగించుకోవాలి. అలా చేస్తే మన వంతు ప్రయత్నంలో మనం సఫలమే..
◆నిశ్శబ్ద.