శనగపిండి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!
posted on Dec 19, 2024 9:30AM
శనగపిండి భారతీయులు ఉపయోగించే పిండులలో ఒకటి. శనగపిండిని పిండి వంటల నుండి, కూరలు, స్నాక్స్ వంటివి తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పకోడీలు, బజ్జీలు చేయడానికి శనగపిండి కావాల్సిందే. అయితే శనగపిండికి తొందరగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన పిండిని వాడుకోవడం అంటే ఎవరికీ నచ్చదు. ఎంత జల్లించి వాడుకోవాలని చూసినా అది అంత ఆరోగ్యం కూడా కాదు. అలా కాకుండా శనగపిండి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అదే విధంగా శనగపిండి ఉపయోగాలు కూడా తెలుసుకుంటే.
శనగ పిండి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6 వంటి అనేక పోషకాలు శనగపిండిలో ఉంటాయి. దీని కారణంగా ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది, ముఖ్యంగా కండరాలను బలోపేతం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
టైట్ కంటైనర్..
గాలి చొరబడని డబ్బాలో గాలి, తేమ తగలకుండా ఉండేలా శనగపిండిని నిల్వచేయాలి. ఇది శనగపిండి తాజాదనాన్ని, రుచిని తగ్గకుండా చేస్తుంది.
చల్లని, పొడి ప్రదేశం..
శనగ పిండిని చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమతో కూడిన ప్రదేశంలో ఉంచడం వల్ల దానిలో ఫంగస్ లేదా కీటకాలు పెరుగుతాయి. దాని కారణంగా అది చెడిపోతుంది.
ఫ్రిడ్జ్ లో..
శనగ పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయవలసి వస్తే, దానిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఇది పురుగు పట్టకుండా చేస్తుంది.
సిలికా జెల్ ప్యాక్..
కంటైనర్‌కు సిలికా జెల్ ప్యాక్‌లను జోడించావి. ఇది తేమను గ్రహిస్తుంది. శనగ పిండిని పొడిగా ఉంచుతుంది. దీని వల్ల శనగపిండి త్వరగా పాడవదు.
సూర్యకాంతి..
శనగ పిండికి డైరెక్ట్ సన్ లైట్ తగలకుండా చూసుకోవాలి. నేరుగా ఎండలో ఉంచడం వల్ల అందులో తేమ పేరుకుపోయి శనగ పిండి త్వరగా పాడవుతుంది.
స్పూన్..
శనగపిండిని బయటకు తీయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన పొడి చెంచాను ఉపయోగించాలి. ఇలా చేస్తే అందులో తేమ తగలదు. పిండి కూడా శుభ్రంగా ఉంటుంది.
కొనుగోలు..
కొత్త శనగ పిండిని కొనుగోలు చేసే ముందు దాని తాజాదనాన్ని, ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయాలి. అందులో తేమ లేదా కీటకాలు లేవని నిర్ధారించుకోండి.
*రూపశ్రీ.