ఉపవాసాల మాసం.. రంజాన్ మాసం..

అటు తెలుగువారి ఉగాది పండుగ అయిపోగానే.. ఇటు ఇస్లాం మతస్థుల పవిత్రమాసం ప్రారంభమవుతుంది. ముస్లిం మస్తస్తులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం.  ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్, ఉపవాసాలతో పవిత్ర మాసంగా భాసిల్లుతుంది.  ఈ సంవత్సరం ఇది మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు నడుస్తుంది. అల్లా ఇస్లాం మతానికి అయిదు ముఖ్యవిషయాలు తెలిపాడు.  అవి.. షహదా, సలాత్, జకాత్, స్వామ్ మరియు హజ్.

స్వామ్ (ఉపవాసం) అనేది రంజాన్‌లో పాటించేది. ఈ పేరు అరబిక్ మూలం 'అర్-రామద్' నుండి వచ్చింది, దీని అర్థం మండే వేడి. రంజాన్ ప్రారంభ, ముగింపు తేదీలు ప్రతి ఏటా మారుతూ ఉంటాయి.  ఎందుకంటే చంద్రుని గమనాన్ని బట్టి వీరి సమయం ఉంటుంది. వివిధ దేశాలలో వేర్వేరు ప్రారంభ ముగింపు తేదీలు ఉంటాయి. ఇస్లామిక్ సంవత్సరం గ్రెగోరియన్ సంవత్సరం కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల రంజాన్ ప్రతి సంవత్సరం 10-12 రోజుల ముందుగా ప్రారంభమవుతుంది, ఇది 33 సంవత్సరాల చక్రంలో ప్రతి సీజన్‌లో వస్తుంది.

రంజాన్ చాలా ప్రత్యేకమైన ఆశీర్వాద రాత్రి. దేవదూత జిబ్రీల్ ప్రవక్త ముహమ్మద్‌కు మొదటిసారిగా ఖురాన్‌ను వెల్లడించాడు. అదే లైలతుల్ ఖద్ర్.  ఈ రాత్రి రంజాన్ చివరి పది రాత్రులలో ఉంటుంది. ప్రతి రంజాన్‌లో పదిలో నిర్దిష్ట రాత్రి మారుతుంది. అల్లాహ్ ఇలా అంటాడు..  "ఆ దేవుడి  ఆజ్ఞ దొరికిన రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" అని.  

ఇక ఈ రంజాన్ నెలలో ఉపవాసం, మసీదులో ప్రార్థనలు,  ఖురాన్ పఠించే సమయం. చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  రంజాన్ సందర్భంగా, అల్లా పాపాలను క్షమిస్తాడు. తప్పులు చేసిన వారిని ప్రతి రాత్రి నరకాగ్ని నుండి విడిపిస్తాడు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు.  సూర్యాస్తమయ ప్రార్థన తర్వాత వారి ఉపవాసాన్ని విరమించుకోవడానికి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలో లేదా మసీదులలో సమావేశమవుతారు. ఈ భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం ప్రారంభానికి ముందు తెల్లవారుజామున జరిగే భోజనాన్ని సుహూర్ అంటారు. కాబట్టి, ఉపవాసం సుహూర్ నుండి ఇఫ్తార్ వరకు విస్తరించి ఉంటుంది. రంజాన్ తర్వాత ఈద్ అల్-ఫితర్ వస్తుంది. ఇది ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సమయంలో ముస్లింలు ఆనందంగా ఉంటారు. సంతోషాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ఈ నెలలోనే దానధర్మాలు చేస్తారు. బీదలకు సహాయం చేస్తారు. ఈద్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. 

ఇకపోతే ఉపవాసం చేయలేని వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు బీదలకు సహాయం చేయడం, ఉపవాసం ఉండే ఇతరులకు ఇఫ్తార్ విషయంలో సహాయం చేయడం లాంటివి చేయొచ్చు. వీలైనంత వరకు పేదవారికి చేసే సహాయం ఎంతో ప్రముఖ్యతగా ఉంటుంది రంజాన్ మాసంలో.

రంజాన్ మాసం గురించి కొన్ని ముఖ్య విషయాలు..

*క్రీ.శ570లో  ప్రవక్త ముహమ్మద్ జన్మించారు.

క్రీ.శ 610 లో  ఖురాన్ మొట్టమొదట దేవదూత జిబ్రీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్‌కు వినిపించారు. ఇలా ఖురాన్ అవతరించింది.

క్రీ.శ622లో  చంద్ర ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభబమయ్యింది.

క్రీ.శ622లో  ప్రవక్త ముహమ్మద్ హింస నుండి తప్పించుకోవడానికి మక్కా నుండి మదీనాకు వలస పూర్తి చేశాడు.

క్రీ.శ624 అల్లా రంజాన్‌లో ఉపవాసాన్ని విధిగా పాటించాలని సూచించాడు.

ఖురాన్ అవతరించిన ఈ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులు. ఖురాన్ ను ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథంగా భావిస్తారు. అందుకే ఈ నెలకు అంత ప్రాముఖ్యత. 

                                       ◆నిశ్శబ్ద.

Related Segment News