చైనాపై డబ్ల్యూ హెచ్ ఓ చెబుతున్నది నిజమెనా?

కరోనా వైరస్ జంతువుల్లో మొదలైయింది డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం వెల్లడించింది.. ఈ మేరకు ఉహాన్ లోని హిల్టన్ హోటల్ లో వర్చువల్ పద్దతిలో నిర్వహించిన విశ్లేషణ అంశాలను డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందానికి నేతృత్వం వహిస్తున్న పీటర్ ఎంబార్బక్ పలు కీలక అంశాలను వెల్లడించారు..

అయితే చైనా లోని వుహాన్ ల్యాబ్ కరోనా వ్యాప్తికి కారణమంటూ చేస్తున్న ప్రచారాన్ని ఎంబార్క్ కొట్టిపారేశారు.. నెల రోజులుగా  డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం ఉహాన్ లోని ఆస్పత్రులు, ల్యాబ్ లు , మార్కెట్లు, చేపల మార్కెట్లను సందర్శించామని ఎంబర్క్ స్పష్టం చేశారు.. డిసెంబర్ 19 నుండి మొత్తం ముఖ చిత్రం మారిపోయిందని.. అది మన చేతిలో వుండదని పీటర్ బెన్ ఎంబెర్క్ వెల్లడించారు.. డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందంలో ఆహార సంరక్షణ, జంతువుల రోగాలలో నిపుణులైన శాస్త్రజ్ఞులు పాల్గొన్నారని వివరించారు.. కొన్ని అంశాలను అర్థం చేసుకుని పరిశీలన చేసిన అనంతరం మాత్రమే వివరిస్తున్నామని ఎంబెర్క్ స్పష్టం చేశారు.. వైరస్ జంతువుల నుండి మానవులకు సంక్రమించి ఉండవచ్చని..దీనిని పూర్తిగా నిర్ధారించలేమని ఈ అంశం పై మరింత లోతైన విశ్లేషణ అవసరమని ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని ఈ బృందం అభిప్రాయపడింది.. అయితే చైనీయులు మాత్రం కోవిడ్-19 ప్రొజన్ మీట్ నుంచి విస్తరించి ఉండవచ్చునని ఇదే నిజమని వెల్లడించడం.. అనుమానాలకు తావిస్తుంది..  

వుహాన్ లోని వైరాలజి ఇనిస్ట్యూట్ సిడిసి ల్యాబ్ ను పరిశీలించింది, కోవిడ్ 19 బ్రేక్ అవుట్ గల కారణాలు కనుగొనలేకపోయామని శాస్త్రజ్ఞులు వివరించారు.. డిసెంబర్ కు ముందే వైరస్ బాగా వ్యాప్తి చెందిందని గుర్తించినట్టు డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం  పేర్కోంది.. ఇది కేవలం వుహాన్ సముద్ర ఆహారం అందించే మార్కెట్ ద్వారానే విస్తరించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్యాండమిక్ గల కారణాలు, కీలక అంశాల పై పరిశోధనలు చేసేందుకు మరో 10 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.. 1970 నుండి ఎబోలాపై జరిగిన పరిశోధనలు నేటికీ కొనసాగుతున్నాయని.. వీటికి గల కారణాలు కనుగొనలేకపోయామని, సార్స్ కోవిడ్ పై పరిశోధనలకు మరింత సమయం పట్టవచ్చని శాస్త్రజ్ఞుల బృందం స్పష్టం చేసింది.. ఇది చాల సున్నితమైన  అంశమని అలా జరిగిందా లేదా అన్న అంశంపై నిజమా..? కాదా ..? ఊహా మాత్రమేనా..? అనే అంశాన్ని భవిష్యత్ లో జరిగే పరిశోధనలు వెల్లడిస్తాయని తేల్చిచెప్పారు.. జంతువుల నుండి మానవులకు ఎలా వ్యాప్తి చెందింది అన్న అంశం పై పరిశోధనలు చేపడుతామని కరోనా వైరస్ శాంపిల్స్ ను పరిశీలించాల్సిందని అన్నారు.. జతువుల నుండి వైరస్ సోకిందనడాని పూర్తిగా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు..

గతం లో డబ్ల్యూ హెచ్ ఓ కరోనా వైరస్ కేవలం గబ్బిలాల నుంచి వచ్చిందన్న అంశాన్ని ప్రచారం చేసిందా అన్న అనుమానం కలుగుతుంది.. అయితే గబ్బిలాల నుంచి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు అక్కడినుంచి ఇతర సముద్రపు ఆహారపు ఉత్పత్తుల ద్వారా వచ్చిందనడానికి ఆధారాలు ఉన్నాయని.. మార్కెట్ లో జరిగిన జంతు మాంసం అమ్మకాలు కారణం కావచ్చని అనుకుంటున్నారు.. చైనాకు చెందిన సిడిసి మాత్రం మార్కెట్ నుండి శాంపిల్స్ సేకరించినప్పటికీ అక్కడ వైరస్ ప్రారంభం అయిందని నిర్ధారించలేమని పేర్కొంది.. అక్కడ మార్కెట్ కి వైరస్ ఎలా వచ్చిందనేది సందేహం.. ఆ ప్రకటలు చూస్తే డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం పై చైనా ప్రభావం ఉందని అసలు వాస్తవాలు వెల్లడిచేయకుండా మరుగున పడేసేందుకే ఈ అంశం తెర మీదికి తెచ్చారని వైద్య బృందం అనుమానాలు వ్యక్తం చేస్తుంది.