అన్నను ప్రశ్నించు అంటూ షర్మిలకు హరీష్ చురక!

షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది వివిధ పార్టీల నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు..సంగారెడ్డి జిల్లాలో రైతు వేదిక సభలో మాట్లాడిన హరీష్ రావు  షర్మిలకు చురకలు అంటించారు.. ఇంటి గుట్టు (రాష్ట్రము) చక్కబెట్టుకొని వాళ్ళు ‘‘ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారని. తెలంగాణకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తే,  ఆ మొసలి కన్నీరును నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని’’ అంటూ పరోక్షంగా షర్మిలను  హరీష్ రావు ఏదేవా చేశారు.. 

షర్మిల కు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అభిమానం ఉంటే, అధికారం దక్కదని, ప్రజల ఆదరణ, ఆలోచన విధానమే ఫలితాలు ఇస్తాయని.. ఏపీ లో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే తెలంగాణాలో అయితే  ఎకరానికి పదివేల చొప్పున, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు. ఏపీలో రైతుల కు జరుగుతున్న అన్యాయాలపై తన సొంత అన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిచలేని  షర్మిల, తెలంగాణ రైతుల గురించి మాట్లాడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు..