ఎసిడిటీ సమస్య ఎందుకు వస్తుంది?? దీనికి జాగ్రత్తలు, నివారణలు ఏంటంటే..

ఎసిడిటీ.. దీన్ని అసిడిటీ.. ఎసిడిటీ అని సంబోస్తూ ఉంటారు. ఇది సాధారణ కడుపు సమస్యలలో ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఇది కడుపులో అధిక యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల కలిగే సమస్య. ఈ ఆమ్లం కడుపులోని గ్రంధుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అసిడిటీ ఎందుకు వస్తుంది?

సాధారణంగా వేళతప్పిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మాంసాహారం, మసాలా, నూనె ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఎసిడిటీని కలిగిస్తుంది.

కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంధులు అదనపు యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి యాసిడ్ అవసరం అవుతుంది. అందుకోసమే ఇది కడుపులో ఈ వ్యవస్థ కూడా ఉంది. కడుపులో ఆమ్లాకు ఎక్కువైనప్పుడు అది  సాధారణంగా మూత్రపిండాల ద్వారా శరీరం నుండి తొలగించబడుతుంది. అయితే మరీ అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయినప్పుడు అనేక ఉదర సంబంధ సమస్యలు ఏర్పడతాయి.

అసిడిటీ మందులతో నయమవుతుంది, మరీ ముఖ్యంగా దీన్ని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

కొన్ని సాధారణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే అసిడిటీని అరికట్టవచ్చు. ఈ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం.

యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమయ్యే ఆహారాలను మానేయాలి..

మసాలా, కాఫీ, కార్బోనేటేడ్ పానీయాలు, ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలను నివారించాలి.

ఒత్తిడి, ఆమ్లాల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి భోజనాన్ని 4-5 చిన్న భాగాలుగా విభజించి 2-3 గంటల వ్యవధిలో తినాలి. 

తిన్న వెంటనే పడుకోకూడదు..

తిన్న తర్వాత పడుకోవడం చాలామంది అలవాటు. అయితే ఈ అలవాటు వల్ల ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు తినేయాలి.

బరువు తగ్గడం..

అధిక కొవ్వు పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల గ్యాస్ట్రిక్ రసాలు అన్నవాహికలోకి ప్రవహిస్తాయి. అధిక బరువు ఉన్నవారిలో ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది.

సొంతంగా మందులు వాడొద్దు..

కొన్ని OTC మందులు కూడా అసిడిటీని కలిగిస్తాయి, ప్రతి డాక్టర్ రోగి పరిస్థితిని బట్టి మందులు రాసాడు. కానీ సొంత అవగాహనతో మందులు వాడితే అవి అసిడిటీ పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకండి.

కొన్ని ఇంటి చిట్కాలు..

అసిడిటీ అనిపిస్తే కింది ఇంటి చిట్కాలు ఫాలో అవ్వచ్చు..

అరటి, యాపిల్..

అరటిపండ్లు సహజంగా యాంటాసిడ్‌లను కలిగి ఉంటాయి, ఇవి అసిడిటీతో పోరాడుతాయి. పడుకునే ముందు కొన్ని ఆపిల్ ముక్కలను తినడం వల్ల గుండెల్లో మంట లేదా రిఫ్లక్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరి నీరు..

కొబ్బరి నీరు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి ఆల్కలీన్‌గా మారుతుంది. కడుపులో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మం అధిక యాసిడ్ ఉత్పత్తి తీవ్రమైన ప్రభావాల నుండి కడుపుని రక్షిస్తుంది. ఇది కాకుండా, కొబ్బరి నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఇది కాకుండా, రోజూ తగినంత నిద్రపోవాలి.. కనీసం 7-8 గంటల నిద్ర అన్నివిధాల ఆరోగ్యం.


                                 ◆నిశ్శబ్ద.