పాలు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయా? అసలు నిజం ఏంటి?

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆందరినీ ఆందోళనకు గురి చేసే విషయం ఏమిటంటే యువత కూడా దీనికి బాధితులుగా మారుతున్నారు. ఎలివేటెడ్ షుగర్ లెవెల్స్ శరీరంలోని మూత్రపిండాలు, నరాలు, కళ్ళు వంటి ఎన్నో అవయవాలను దెబ్బతీస్తాయి.  అలాగే అనేక రకాల ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మధుమేహం నియంత్రణ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, ఆ కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే అందరినీ షాకింగ్ గా అనిపించే విషయం ఏమిటంటే.. క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

పాలకు డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా?
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఫుడ్ డైట్ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారం  రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి. అయితే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే పాలు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందనేది ఇప్పుడు బయటపడిన కొత్త విషయం.

పాలు, పాల ఉత్పత్తులు మెటబాలిక్ సిండ్రోమ్, స్థూలకాయం, అధిక రక్తపోటును నివారిస్తాయి.  మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. పాలు, పెరుగు రెండూ మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 మధుమేహం నుండి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.

పాలు కాల్షియం, ప్రోటీన్ రెండింటికీ అద్భుతమైన మూలం. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. క్యాల్షియం, ప్రొటీన్లు రెండూ పెరుగుతున్న పిల్లలకు మహిళలకు అవసరయ్యేవే. పాలలో ఇవి పుష్కలంగా ఉండటం వల్ల పాలుచాలా ఉపయోగకరం. పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

◆నిశ్శబ్ద.