భారత్ విజయాలకు వెస్టిండీస్ బ్రేక్
posted on Nov 25, 2013 11:56AM
భారత్ పర్యటనలో వెస్టిండీస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. విశాఖపట్న౦లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. డారెన్ సామి 45బంతుల్లో 63 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత కోహ్లి 99, ధోని 51 నాటౌట్ గా నిలిచి ఇండియాకు 288 పరుగులను అందించారు.
289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చార్లెస్ 12, ఆతరువాత వచ్చిన శామ్యూల్స్ 8 పరుగులు చేసి వెంటనే అవుటయ్యారు. ఈ స్థితిలో విండీస్ ను పావెల్, డారెన్ బ్రావో శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత సిమన్స్ 62, డారెన్ సామి 63 పరుగులు చేసి వెస్టిండీస్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో విశాఖలో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.