పాలమూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌పై ఏసీబీ కస్టడీ పిటిషన్

 

మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టు అయిన కిషన్‌ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిం చాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, కిషన్ తన విధి నిర్వహణలో  ఆదాయానికి మించిన భారీ ఆస్తులను సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

ఈ నేపథ్యంలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబం ధించిన వివరాలు, బ్యాంకు లావాదేవీల ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పలు అంశాలపై లోతైన విచారణ అవసరమని ఏసీబీ అధికారులు పేర్కొంది. అక్రమంగా సంపాదించిన ఆస్తుల మూలాలు, వాటిలో భాగస్వాముల పాత్ర, బినామీ లావాదేవీల కోణం, ఇతర అధికారులతో ఉన్న సంబంధాలపై స్పష్టత కోసం కస్టడీ అవసరమని ఎసిబి అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు. 

ఈ కారణంగానే కిషన్‌ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అంతేకాకుండాఈ కేసులో కీలకంగా భావిస్తున్న పలువురు వ్యక్తులను విచారించాల్సి ఉండటంతో పాటు, మరిన్ని డాక్యు మెంట్లు సేకరించాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కస్టడీ లభిస్తే ఈ దర్యాప్తు మరింత వేగంగా, సమగ్రంగా సాగుతుందని వారు భావిస్తు న్నారు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై రేపు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. కోర్టు తీసుకునే నిర్ణయంతో కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu