మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్
posted on Dec 30, 2025 4:00PM

కొత్త సంవత్సర వేడుకలు దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 31న మెట్రోరైలు వేళలను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి. మెట్రో రైలు ప్రయాణీకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉంటాయి.
మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు