తెలుగుజాతి వెలుగు కిరణం చంద్రబాబుకు స్వాగ‌తం సుస్వాగ‌తం!

ఆంధ్రుల న‌మ్మ‌కం.. పేద‌ల స‌మ్మ‌తం.. న‌డిసంద్రంలో ఉన్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఆశాదీపం.  ఆయ‌న‌ శ్వాస అమ‌రావ‌తి..  ధ్యాస పోల‌వ‌రం..  మొత్తంగా తెలుగు ప్ర‌జ‌ల అభివృద్ధి ఆయన ఏకైక ల‌క్ష్యం.. ఆయ‌న అడుగు పెడితే తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంత‌మైనా పులకించి పోతుంది..  ఆయన మాట వింటే గుండెల్లో తెలియ‌ని ధైర్య‌ం వస్తుంది..  ఆయన రాజ‌కీయ చ‌క్ర‌వ‌ర్తి..  అయినా అంద‌రి ఇళ్ల‌లో సాధార‌ణ మ‌నిషి.. ఆయ‌నే టీడీపీ అధినేత‌, సైబరాబాద్ రూపకర్త,   అభివృద్ధి చిరునామా, న‌వ్యాంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.

 ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  నుంచి విడిపోయిన న‌వ్యాంధ్ర‌ను ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా నిలిపేందుకు ఐదే ళ్లు కృషి చేశారు. ప్ర‌పంచ దేశాల్లో పేరున్న కంపెనీల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించారు.  అన్ని రంగాల్లో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ దూసుకుపోయేలా చేయ‌డంతో పాటు.. తెలుగు ప్ర‌జలు గొప్ప‌గా చెప్పుకొనేలా అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి అంకురార్ప‌ణ చేశారు.

 కానీ,  2019లో రాక్ష‌స‌ పాల‌నకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఫ‌లితంగా గ‌డిచిన ఐదేళ్ల‌లో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలేని అనాథ‌గా మారిపోయింది. ప్ర‌జ‌లు పొట్ట‌చేత ప‌ట్టుకొని ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స‌లు వెళ్లాల్సి వ‌చ్చింది.  చంద్ర‌న్న‌తోనే మా బ‌తుకులు మారుతాయ‌ని గుర్తించిన న‌వ్యాంధ్ర ప్ర‌జానీకం 2024లో  చరిత్ర కనీవినీ ఎరుగని మెజార్టీతో అధికార పీఠాన్ని అప్ప‌గించారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలిసారి హైద‌రాబాద్ లో అడుగుపెడుతున్న తెలుగు ప్ర‌జ‌ల గుండె చప్పుడు చంద్ర‌బాబు నాయుడి గారికి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుదాం. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో  భారీ సంఖ్యలో పాల్గొనేందుకు తరలిరండి. జనం కోసం బాబు.. బాబు కోసం జనం అని చాటుతూ  రండి కదిలిరండి.. తెలుగుజాతి వెలుగు కిరణం చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుదాం. అదే విధంగా ఆదివారం (జులై 7)న ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో  జరిగే ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు దార్శనికత, అభివృద్ధి కాముకతపై ముచ్చటించుకుందాం.. ఆయన విజయగాథలను నెమరువేసుకుందాం.