కెసీఆర్ ఇలాఖాలో నీటి కటకట

ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో తాగునీటి కటకట వాటిల్లింది. భారతదేశంలోనే పవర్ ఫుల్ సిఎం కెసీఆర్ అని ప్రచారంలో ఉన్నప్పటికీ ఎండాకాలంలో గజ్వేల్ వాసులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. దాదాపు 60 శాతం మంది నీటి ఎద్దడికి గురవుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకదర్గంలో మొత్తం 3, 22, 130 మందిలో 1,93,278 మంది తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ఆరు మండలాల్లో ప్రజలు దాహార్తికి గురవుతున్నారు. వర్గల్ మండలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. 
మరుగుదడ్లు కేవలం 46.73 శాతం మందికే ఉన్నాయి. అంటే మండలంలో మొత్తం 3.2 లక్షల మంది జనాభా ఉంటే లక్షా 48 వేల మంది మరుగుదడ్లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 
అంటే మిగిలిన  లక్షా 73 వేల మంది ఆరు బయట విసర్జన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి స్వంత ఇలాఖాలోనే ఇటువంటి పరిస్థితి ఉందంటే మిగతా ప్రాంతాల్లో అంచనా వేయవచ్చు.