‘స్టీల్’ ప్రైవేటీకరణ జరగదు!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పునరుద్ఘాటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్   ఆరోపణలపై స్పందించిన ఆయన  ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తోందన్న ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారన్న విషయం తన దృష్టికి వచ్చిన 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించామని చెప్పారు. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29న మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు.