కుంభకోణంలో ఏపీ మంత్రులు అయ్యన్నకు, గంటాకు నోటీసులు

సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంలో అసలు దోషులెవరో గుర్తించేందుకు గానూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. విచారణలో భాగంగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులకు సిట్ నోటీసులు పంపనుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు వెల్లడించారు. విశాఖపట్నం భూకుంభకోణంలో ఆరోపణలు చేసిన వారు, తగిన ఆధారాలను చూపాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేసిన అందరు రాజకీయ నాయకులకు నోటీసులు పంపుతామని..వారిని సిట్ ప్రశ్నిస్తుందని కుటుంబరావు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu