వీఐపీలు హెలికాఫ్టర్లు ఎక్కవద్దన్న "మహా" ప్రభుత్వం

మే 25న లాతూర్ జిల్లాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ అదుపుతప్పి క్రాష్ ల్యాండింగ్ జరిగి తృటిలో పెను ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవలికాలంలో హెలికాఫ్టర్లు వరసుగా మొరాయిస్తూ..ఎమర్జెన్సీ ల్యాండింగులు అవుతుండటంతో ముఖ్యమంత్రి సహా ఇతర వీఐపీలు ఎవ్వరూ చాపర్లను వాడొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సీఎం ఫడ్నవీస్ పర్యటనలు చేయాల్సి వస్తే..విమానాశ్రయాలున్న ప్రాంతాలకు విమానంలో వెళ్లి..అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu