మాల్యా రావడనికి ఏడాది పట్టొచ్చు...!

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కున్న కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆతరువాత కొద్దిసేపటికే బెయిల్ మంజూరు అయి బయటకు వచ్చారనుకోండి. అయితే ఇప్పుడు మాల్యాను ఇండియాకు రప్పించడానికి ముమ్మర్ల ఏర్పాట్లు చేస్తున్నారు.  అతన్ని వీలైనంత త్వరగా భారత్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే మాల్యా భారత్‌ రావడానికి సుమారు 6 నుంచి 12 నెలలు పడుతుందని ఈడీ చెబుతోంది.