లగచర్ల బాధితులు హస్తినకు
posted on Nov 17, 2024 11:29AM
తెలంగాణ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లోని లగచర్ల భూములను లాక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వారి వాణిని ఢిల్లీలో వినిపించేందుకు బిఆర్ ఎస్ నేతలు సిద్దమయ్యారు. వీరికి బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ లగచర్ల బాధితులను వెంట బెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 18(సోమవారం) ఆమె లగచర్ల బాధితులతో ఎస్ సి ఎస్ టి కమిషన్ ను ఆశ్రయయించనుంది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తూ వేలాది ఎకరాలు సేకరించింది. అభివృద్ది పేరిట రైతుల భూములను సేకరించింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు భూములను సేకరించిన బిఆర్ఎస్ భూముల సేకరణను వ్యతిరేకించడం ద్వంద వైఖరి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయడానికి కెటీఆర్ ఉసిగల్పినట్లు ఆధారాలు బయటపడ్డాయి. తాజాగా లగచర్ల బాధితులను బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంటేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తుంది.