ముంబాయి భామతో చైతు చిందులు

 

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం "ఆటోనగర్ సూర్య". దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఓ డాన్సింగ్ సాంగ్ ను చైతు, ముంబాయి భామ కిమాయాలపై ఇటీవలే చిత్రీకరించారు. ఈ పాటకు రాజుసుందరం కొరియోగ్రఫీ చేసారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో రాకూల్ ప్రీత్ సింగ్ ఓ ముఖ్యపాత్రలో నటించింది. కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.